ETV Bharat / state

చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు - chandrababu serious on vijayawada police

విజయవాడలో.. అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సుయాత్రను పోలీసులు అడ్డుకున్నారని... పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా అధినేత చంద్రబాబుతో సహా ఐకాస నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఐకాస నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బలవంతంగా చంద్రబాబు, లోకేశ్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన నివాసానికి తరలించారు.

చంద్రబాబునాయుడు అరెస్ట్​
చంద్రబాబునాయుడు అరెస్ట్​
author img

By

Published : Jan 8, 2020, 8:41 PM IST

Updated : Jan 8, 2020, 10:34 PM IST

చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు

విజయవాడలో.. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సహా ఐకాస నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వేదిక కల్యాణమండపం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఐకాస బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవటంతో పాదయాత్రగా వెళ్లేందుకు అఖిలపక్ష నేతలు, ఐకాస ప్రతినిధుల ప్రయత్నించగా... పోలీసులు వారి అడ్డుకున్నారు.

పోలీసులతో వివిధ పార్టీల నేతలు, ఐకాస ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా బెంజ్ సర్కిల్ రోడ్డుపై... చంద్రబాబు బైఠాయించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు పోరాటం ఆగదన్నారు. 5 నిమిషాల్లో బస్సులు వదలకుంటే ఐకాస నేతలందరూ వాటి దగ్గరకు వెళ్లామని తెలిపారు.

'మమ్మల్ని ఎందుకు ఆపారు?.. ఎందుకీ దౌర్జన్యం. ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మేం చట్టప్రకారమే నడుచుకుంటున్నాం. ఏ చట్టం ప్రకారం మమ్మల్ని అడ్డుకుంటున్నారు. పోలీసులే అమరావతి ఐకాస బస్సు యాత్రకు అనుమతి ఇచ్చారు. బస్సు మార్గానికి మాత్రం అనుమతి లేదని తిరస్కరించారు. బస్సు యాత్రను కావాలనే అడ్డుకుంటున్నారు. అణచివేతతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. గాంధేయ మార్గంలో నిరసన తెలపడం తప్పు కాదు' అని చంద్రబాబు అన్నారు. అమరావతి ఐకాస బస్సు యాత్రను అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

బస్సు యాత్రకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం చంద్రబాబు, లోకేశ్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును వాహనంలో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వాహనం ముందు కార్యకర్తలు బైఠాయించారు. డ్రోన్‌ సాయంతో ఆందోళనకారుల దృశ్యాలు పోలీసులు చిత్రీకరిస్తున్నారు. అనంతరం చంద్రబాబును ఆయన నివాసానికి తరలించారు.

ఇదీ చూడండి: పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటాం..

Intro:Body:

అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో సమావేశం అనంతరం... ఐకాస నేతలు పాదయాత్రకు బయల్దేరారు. తమ బస్సు యాత్రను అడ్డుకున్నారని... ఆ బస్సుల వరకు కాలినడక వెళ్లి యాత్ర చేపడతామని నేతలు తేల్చి చెప్పారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి పరిరక్షణ సమితి సమావేశం కేంద్ర కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రగా వెళ్లేందుకు ఐకాస నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఐకాస నాయకులను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. బస్సు యాత్ర ప్రారంభించే తీరుతామని నేతలు భీష్మించారు. బస్సులు అ... కేంద్ర కార్యాలయం వద్దకు తీసుకురావాలని... లేకుంటే తామే బస్సుల వద్దకు పాదయాత్రగా వెళ్తామని పోలీసులతో వాదించారు. అరెస్టులతో తమను నిలువరించలేరని.... ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.

Conclusion:
Last Updated : Jan 8, 2020, 10:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.