ETV Bharat / state

రౌడీలకు అడ్డాగా ఏపీని మార్చేశారు: చంద్రబాబు - ap news

అన్ని ప్రాంతాల వారు అమరావతి పోరాటానికి సహకరిస్తుంటే ఏపీ సీఎం జగన్‌కు ఏమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే విభజన ఆంధ్రప్రదేశ్​ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశామని తెలిపారు.

రౌడీలకు అడ్డాగా ఏపీని మార్చేశారు: చంద్రబాబు

author img

By

Published : Dec 15, 2020, 10:26 PM IST

ఏపీకి జరుగుతున్న అన్యాయం చూసి పొట్టిశ్రీరాములు ఆత్మ కూడా క్షోభిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 4 నిర్వహించటమే సబబుగా పేర్కొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా అదనపు ఆదాయం వచ్చే విధంగా అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు. భాజపా కూడా ఉద్యమానికి సహకరిస్తూ మోదీ కూడా సానుకూలమని ప్రకటించారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పోతోందని.. ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేకుంటే ప్రజాగ్రహం ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేస్తే... పొట్టి శ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు నాంది పలికారని, త్యాగానికి మారుపేరుగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు.

వైకాపాది దుర్మార్గపు, దుష్ట పరిపాలన అన్న చంద్రబాబు.. రౌడీలకు అడ్డాగా ఏపీని మార్చేశారని దుయ్యబట్టారు. వైకాపా మాదిరిగా తెదేపా ప్రభుత్వమూ అరాచకాలు చేసి ఉంటే ఒక్కరూ కూడా బయట తిరిగేవారు కాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.