ETV Bharat / state

జగన్ పాలన ఏంటో​ కేసీఆర్​కూ తెలిసిపోయింది: చంద్రబాబు

author img

By

Published : Oct 29, 2019, 11:17 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలన సత్తా ఏంటో కేసీఆర్​కు కూడా తెలిసిపోయిందంటూ... తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకూ జగన్​ను వెనకేసుకొచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు తెదేపా పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు.

జగన్​ పరిపాలనా సత్తా ఏమిటో కేసీఆర్​కు కూడా తెలిసిపోయింది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలనపై పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సెటైర్లు వేస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు. నిన్నమొన్నటి వరకూ కలిసి మెలిసి ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ పాలనపై కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఇటీవల కేసీఆర్ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. "ఎగిరెగిరి పడుతున్న జగన్ సత్తా .. ఆరునెలల్లో తెలుస్తుంది" అని కేసీఆర్ మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వాన స్థితికి చేరిందని అందుకే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.

జగన్​ పరిపాలన సత్తా ఏమిటో కేసీఆర్​ సైతం తెలిసిపోయింది: చంద్రబాబు

ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.