ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని తెదేపా అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. సిబ్బంది సకాలంలో నో డ్యూస్, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆరోపించారు. అధికారులు అందుబాటులోలేని కారణంగా అందజేయలేకపోయామనే కారణాలు చెప్పారన్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ నామినేషన్లు దాఖలును అడ్డుకోగా.. ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలకు అనేకమంది సకాలంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 76చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఘటనలు చోటుచేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆయా ఆధారాలను తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం సహా... భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకొనేలా పోలీసులను ఆదేశించాలన్నారు. పులివెందుల, మాచర్ల, పుంగనూరు, మంత్రాలయం, తెల్లకూరు, కావేటినగర్, పుల్లంపేట స్థానాల్లో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదల