ETV Bharat / state

పరాకాష్ఠకు వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి: చంద్రబాబు

పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏ ఉద్యోగైనా సరే మూడు నెలలకు మించి నిరీక్షణ(వెయిటింగ్‌)లో ఉంటే... ఆ మొత్తం కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తామని ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వమే వెయిటింగ్‌లో ఉంచి... వాళ్లపై చర్యలు చేపట్టడం అమానవీయమని దుయ్యబట్టారు.

chandra babu fire on ycp decisions
ఆ ఉద్యోగులకు జీతాలు చెల్లించబోము: ఏపీ ప్రభుత్వం
author img

By

Published : Feb 9, 2020, 8:55 PM IST

వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్ఠకు చేరుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలను అష్టకష్టాలకు గురి చేస్తూ... ఇప్పుడు ఉద్యోగులపైనా ప్రభుత్వం ఫ్యాక్షనిస్ట్ పంజా విసిరిందని విమర్శించారు. '3 నెలలకు మించి వెయిటింగ్‌లో ఉంటే ఆ ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని... 6 నెలలు దాటి వెయిటింగ్‌లో ఉంటే అసాధారణ సెలవుగా పరిగణిస్తామని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఉద్యోగులపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ఠ' అని బాబు మండిపడ్డారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ఈ చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

పోస్టింగ్‌లు ఇవ్వకుండా పోలీసు అధికారులు, సిబ్బందిని గత 8 నెలలుగా వేధిస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పుడు జీతాలు కూడా ఇచ్చేది లేదని ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వెయిటింగ్‌లో ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ... ప్రభుత్వమే వెయిటింగ్‌లో ఉంచి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. 'ప్రభుత్వం తప్పు చేసి ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా?. ఎందుకు ఇంత మందిని 8 నెలలకుపైగా వెయిటింగ్‌లో పెట్టారు?. 3 నెలలు కాగానే ప్రభుత్వ సమీక్షకు ఎందుకు పంపలేదు? ఇటువంటి దుర్మార్గ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • వైసిపిప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది.ప్రతిపక్షాల నాయకులు,కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు.రైతులు,రైతుకూలీలు,మహిళలు,యువత,కార్మికులు అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలుపెట్టి,ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫాక్షనిస్ట్ పంజా విసిరింది(1/6)

    — N Chandrababu Naidu (@ncbn) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: లోక కళ్యాణం కోసం 21 రోజులు సజీవ సమాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.