ETV Bharat / state

'జగన్​కు ఓ చట్టం.. మాకు మరో చట్టమా'.. చంద్రబాబు VS డీఎస్పీ - ఆంధ్రప్రదేశ్​ పోలీస్

Chandrababu vs police: బుధవారం ఆంధ్రప్రదేశ్​లో హైటెన్స్​న్​ వాతావరణం నెలకొంది. ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత మూడు రోజులు కుప్పం పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గానికి వెళ్లగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కొత్త జీవో ప్రకారం రోడ్​షోలు, పర్యటనలు చేయకూడదంటూ ఆంక్షలు జారీ చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైనా చంద్రబాబు.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఏపీలో జగన్​ బ్రిటీష్​ వాళ్ల కంటే ఘోరంగా వ్యవహరిస్తోన్నారని ధ్వజమెత్తారు. తనను అడ్డుకున్న డీఎస్పీకి, చంద్రబాబుకు మధ్య మాటల యుద్దం జరిగింది.

Chandrababu vs police
Chandrababu vs police
author img

By

Published : Jan 5, 2023, 12:20 PM IST

Chandrababu vs police: ఆంధ్రప్రదేశ్​లో సీఎం జగన్‌ బ్రిటిష్‌ వాళ్ల కంటే ఘోరంగా తయారయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గానికి వస్తున్న ఆయనను ఏపీ సరిహద్దులో బాదూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నడిరోడ్డుపైనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో స్పష్టతివ్వాలని పోలీసులను ప్రశ్నించారు.

బ్రిటిష్‌వాళ్ల కన్నా ఘోరంగా జగన్‌ పాలన:చంద్రబాబు

చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో డీఎస్పీ అక్కడికి రాగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

చంద్రబాబు: అనుమతి అడిగితే తిరస్కరించామన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా వచ్చా. నా ప్రజలతో నేను మైకులో మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఎక్కడ అనుమతి ఇస్తారు? ఎందుకు ఇవ్వరో స్పష్టంగా చెప్పాలి. నా కార్యక్రమాలకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలని నేరుగా అడుగుతున్నా. నా నియోజకవర్గానికి రాకుండా నేను పారిపోవాలా?
డీఎస్పీ: మేం వెళ్లమని చెప్పలేదు.

చంద్రబాబు: ఐదు కోట్ల ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. నాకు మైకు ఎందుకివ్వరు? నా రోడ్‌షోకు ఎందుకు అనుమతివ్వరు? నా ప్రజలతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారు. నా గత పర్యటనలో ఇదే నియోజకవర్గంలో 74 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టారు. పది మందిని అరెస్టు చేసి, నెల రోజులు జైల్లో పెట్టారు. నన్నూ జైల్లో పెట్టండి. అందరికీ బేడీలు వేయండి. నిన్ననే జగన్‌ వెళ్లాడు.. ఆయన రోడ్డుపై వెళ్లొచ్చా? వైకాపాకు ఒక చట్టం, నాకు ఒక చట్టమా? మీ డీజీపీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
డీఎస్పీ: లిఖితపూర్వకంగా మీరడిగితే ఇస్తాం సార్‌.

చంద్రబాబు: నేను మౌఖికంగా అడుగుతున్నా. నియోజకవర్గంలో తిరగాలని అడుగుతున్నా.
డీఎస్పీ: నియోజకవర్గంలో తిరిగేందుకు అభ్యంతరం లేదు సార్‌.

చంద్రబాబు: సమావేశం పెట్టాలని అడుగుతున్నా.
డీఎస్పీ: సమావేశం గ్రామాల్లో పెట్టుకునేందుకు అభ్యంతరం లేదు. రోడ్డుపై అయితేనే అభ్యంతరం.

చంద్రబాబు: మైకు ఎందుకు ఇవ్వలేదు?
డీఎస్పీ: మైకు ఎక్కడ అనేది చెప్పాలని అడిగాం.

చంద్రబాబు: ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడికి వెళ్తాం. ప్రైవేటు స్థలాల్లో ఎక్కడ పెట్టుకోవాలి. నా వాహనం ఇవ్వరా?
డీఎస్పీ: ఇస్తాం సార్‌. ఎక్కడికి పోతుంది?

చంద్రబాబు: నేను వాహనం ఎక్కి ప్రజలనుద్దేశించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ నుంచి మాట్లాడాలి?
డీఎస్పీ: రోడ్డు మీద కాకుండా పల్లెల్లో మాట్లాడవచ్చు.

చంద్రబాబు: నా వాహనం తీసుకెళ్లారు. లోపల పెట్టమంటే అక్కడే సమావేశం పెడతాను. ఇవ్వరా?
డీఎస్పీ: వాహనాలు ఇస్తాం.. లోపల పల్లెల్లో మైక్‌ అనుమతి ఉంది. వాహనం కాకుండా మైక్‌లో మాట్లాడవచ్చు.

చంద్రబాబు: వాహనంపై మాట్లాడేందుకు లేదా?
డీఎస్పీ: వాహనంపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీ రహదారులపై మాట్లాడకూడదు.

చంద్రబాబు: గ్రామాల్లో పంచాయతీ రోడ్డు కాకుంటే ఏముంది?
డీఎస్పీ: పల్లెల్లో అభ్యంతరం చెప్పడం లేదు. జీవో ప్రకారం వెళ్తే చాలు.

చంద్రబాబు:మీరు నా వాహనం ఇచ్చే వరకు పల్లెలకు వెళ్లి తిరుగుతా అంటూ ఆయన ముందుకు కదిలారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.