చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో తెల్లవారుజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం సృష్టించింది. లక్ష్మి అనే 46 సంవత్సరాల మహిళ కిరాణా షాపు వద్ద నుంచి ఇంటికి వస్తోంది. హెల్మెట్ ధరించి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి... మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడు తెంచేందుకు యత్నించాడు. అప్రమత్తమైన మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా..