రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ఎందుకు గచ్చిబౌలిలోని కొవిడ్ ఆస్పత్రి ప్రారంభించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. భాగ్యనగరంలో కొవిడ్-19 వేగంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బీఆర్కే భవనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
గాంధీలో సరైన సౌకర్యాలు లేక కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూస్తే లక్షల రూపాయల కరోనా దోపిడీ జరుగుతోంది. ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా తక్షణమే గచ్చిబౌలి కొవిడ్ ఆస్పత్రికి పేషెంట్లను పంపాలి. ముందస్తు చర్యల్లో భాగంగా హోమియోపతి మెడిసిన్ ఉచితంగా పంపిణీ చేయాలి. - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు...