కరోనా వల్ల మార్చి నుంచి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూసివేయడం వల్ల వాటిలో పనిచేసే ఉద్యోగులు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు.
"మార్చి 22 నుంచి పాఠశాలలు, కళాశాలలు అన్ని మూసివేబడ్డాయి. ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో చెప్పలేం. ఇలాంటి దుస్థితి నెలకొని ఉంది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గురుకులంలో పనిచేసే గెస్ట్ లెక్చరర్స్‌కు కొన్ని నెలలుగా జీతాలు లేవు. వీరందని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చెస్తున్నాం."
-చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్