హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో అకాల వర్షాల వల్ల అనేకమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం ఏంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. వారి జీవితాలు చిన్నభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలను ఆదుకోవాలని చాడ కోరారు.
హైదరాబాద్ వరంగల్ వంటి నగరాల్లో నల్లాలు, చెరువులు, కుంటలు అక్రమాలకు గురికావడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని వెంకట్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ వ్యవసాయం కొనసాగుతున్నా.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు.
ఇదీ చదవండి: చాడ పుస్తకం రాశారు.. ఈటల ఆవిష్కరించారు..