లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంలో సోదాలు..
ఇప్పటి వరకు దాదాపు రూ.12 కోట్ల మేర ఆయా సంస్థలు జీఎస్టీ, సేవా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయ్యేసరికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లోని హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంపై దాడులు నిర్వహిస్తున్న అధికారులు ఆమె వద్ద రూ.25 లక్షల వరకు సేవా పన్ను బకాయి ఉన్నట్లు అంచనా వేశారు. ఓ మీడియా సంస్థలో తనిఖీలు చేసి.. సేవా పన్ను, జీఎస్టీ రెండు కలిపి దాదాపు మూడు కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఫిట్నెస్ కేంద్రాల్లో 30 లక్షలు..
భారత్ నుంచి విదేశాలకు విద్యార్థులను పంపే ఓ కన్సల్టెన్సీపై హైదరాబాద్, విజయవాడల్లోని ప్రధాన కార్యాలయాలపై సోదాలు నిర్వహించి.. రెండు కోట్ల మేర జీఎస్టీ, సేవా పన్ను చెల్లించాల్సి ఉందని గుర్తించామన్నారు. హైదరాబాద్‌లోని రెండు ఫిట్ నెస్ సెంటర్లలో 30లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తేల్చినట్లు తెలుస్తోంది. చిట్‌ఫండ్ కంపెనీలు, స్థిరాస్థి సంస్థల్లో కోట్లాది వరకు పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ సంస్థలు మొత్తం రూ.12 కోట్లు జీఎస్టీ, సేవా పన్నుల కింద చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించి.. ఆ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషిస్తున్నారు.
ఇవీ చూడండి: 'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'