మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున ఎక్కువ సమయం పడుతోందన్న ఆయన.. ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారని వివరించారు. ఎలాంటి జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 32,605, భాజపాకు 30,974, కాంగ్రెస్‌కు 7,380 ఓట్లు వచ్చాయి.
ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున ఎక్కువ సమయం పడుతోంది. ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారు. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం. - వికాస్‌రాజ్, సీఈవో
ఇవీ చూడండి..