భారీ పోలీసు పహారా మధ్య లాక్‌డౌన్ రెండోరోజు కొనసాగుతోంది. హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్లోని ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్ చెకింగ్ పాయింట్లను మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ సందర్శించి పరిశీలించారు. నియమాలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లాక్‌డౌన్ రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోందని.. ప్రజలు నియమాలను పాటిస్తున్నారని తెలిపారు.
ఆర్టీసీ క్రాస్రోడ్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్ వద్ద ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారని డీసీపీ తెలిపారు. లాక్‌డౌన్ మొదటిరోజు మధ్య మండలం పరిధిలో నియమాలు ఉల్లంఘించిన 600 మందిపై కేసు నమోదు చేశామన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, రామ్ నగర్ క్రాస్ రోడ్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 10 గంటలకు మూసివేశారు.
ఇదీ చూడండి: టీకా పంపిణీపై లాక్‌డౌన్ ప్రభావం...కేంద్రాలకు తగ్గిన జనం