వచ్చే ఏడాది నుంచి దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో కేంద్ర మహిళా మంత్రులు, అధికారులను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. హిమాయత్ నగర్ భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ మెమోరియల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
నిజాం పాలనలో రజాకార్ల రాక్షసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆడపడుచులు బతుకమ్మ ఆడారని కేంద్ర మంత్రి తెలిపారు. పూలతో భగవంతున్ని పూజించడనే కాకుండా.. పూలనే పూజించే సంస్కృతి, సంప్రదాయాల బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పల్లెల, పట్టణాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం నగరంలోని సీతారాంబాగ్లో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ పండుగ అన్ని ప్రాంతాల్లో వైభవంగా జరుగుతోంది. గ్రామాగ్రామాన మన ఆడపడచులు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఆనాడు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా మహిళలు పోరాడటం జరిగింది. ఈ పండుగలో మనం అమ్మవారిని మరింత భక్తితో పూలతో అలంకరించి జరుపుకుంటాం. బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా. - కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి.
మలేషియన్ టౌన్షిప్లో ఘనంగా వేడుకలు
నగరంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి గెటేడ్ కమ్యూనిటీలు బతుకమ్మ వేడుకలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నాయి. కూకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నిర్వహించిన కోలాటం అందరిని ఆకట్టుకుంది. అందరూ కలిసి ఆధునిక సంగీతానికి తగ్గట్లుగా నాట్యం చేస్తూ ఆకట్టుకున్నారు. బతుకమ్మ పాటకు చిన్నా, పెద్దా అందరు కలిసి నాట్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఇదీ చూడండి: