ETV Bharat / state

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్రబృందం

భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని అధికారుల బృందం తొలిరోజు హైదరాబాద్ పాతబస్తీలోని పలు కాలనీల్లో వరద విలయాన్ని పరిశీలించింది. వరదల వల్ల కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం... వారికి వివరించింది. వర్షబీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని శుక్రవారం కూడా కేంద్రబృందం అంచనా వేయనుంది.

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం

author img

By

Published : Oct 22, 2020, 7:57 PM IST

భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. దిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం తొలుత సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్​, జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రదర్శన...

అధిక వర్షాలు, వరద వల్ల కలిగిన నష్టం, సంబంధిత వివరాలను అధికారులు... కేంద్ర బృందానికి వివరించారు. రూ. 8, 633 కోట్ల మేర పంటనష్టం, రూ. 222 కోట్ల మేర రహదారులకు నష్టం సహా జీహెచ్​ఎంసీలో రూ. 567 కోట్ల వరకూ నష్టం జరిగిందని అధికారులు వివరించారు .నష్టానికి సంబంధించి ఛాయాచిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

రెండుగా విడిపోయి...

సీఎస్​తో సమావేశం అనంతరం కేంద్రబృందం రెండుగా విడిపోయి ఒక బృందం జీహెచ్ఎంసీలో, మరో బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేశారు. చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా వద్ద దెబ్బతిన్న రైల్వే వంతెన ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి నష్టానికి సంబంధించిన వివరాలు సేకరించారు.

శుక్రవారం కూడా...

కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు రఘురామ్, ఎస్కే కుష్వారా ఆర్వోబీ పునరుద్ధరణ పనులు.. నాలాపూడికతీత తొలగింపును పరిశీలించారు. వరద ఉద్ధృతికి కట్టలు తెగిన గుర్రం చెరువు, పల్లె చెరువు పరిస్థితిని ఆరా తీశారు. చివరగా అప్పచెరువును పరిశీలించిన కేంద్ర అధికారులు... శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలని సూచించారు. మరమ్మతు పనులు, గండి పడటం వల్ల నష్టాన్ని రాష్ట్ర అధికారులు... కేంద్ర బృందానికి వివరించారు.

శుక్రవారం కూడా రాష్ట్రంలో పర్యటించనున్న బృందం... వరదల నష్టంపై నివేదిక రూపొందించి కేంద్రానికి అందించనుంది.

ఇదీ చదవండి : చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.