హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర బృందం... డీజీపీ, ముగ్గురు సీపీలు, ఏడీజీలు, ఐజీలతో సమావేశమయ్యారు. అనంతరం కంటైన్మెంట్ జోన్లు, అమీర్‌పేట్‌లోని ప్రకృతి వైద్యశాలను పరిశీలిస్తారు. మ.3 గంటలకు మెహదీపట్నం రైతుబజార్, రాత్రి బస కేంద్రాలను సందర్శిస్తారు.
హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. నిన్న గచ్చిబౌలిలోని కొవిడ్(టిమ్స్) ఆస్పత్రిని సందర్శించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేస్తోంది.
ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..