ETV Bharat / state

Kishan reddy: 'డిసెంబర్​ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్​' - telangana varthalu

డిసెంబర్​ నాటికి దేశంలోని ప్రజలందరికీ కేంద్రం వ్యాక్సిన్​ను అందజేస్తుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సిన్​ అందడం లేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Kishan reddy
'డిసెంబర్​ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్​'
author img

By

Published : Jun 16, 2021, 3:29 PM IST

డిసెంబర్ లోపు 200కోట్ల వ్యాక్సిన్లను దేశంలో ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. సేవాహి సంఘటన్​ కార్యక్రమంలో భాగంగా రాంగోపాల్​పేట్​ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరగగా.. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆశా వర్కర్లకు ఆయన తమ చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేశారు. అంతకు ముందు డివిజన్​ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

దేశంలోని ప్రజలందరికీ డిసెంబర్ నాటికి ఉచితంగా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. అతి త్వరలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించి ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఎవరూ కూడా వ్యాక్సిన్ అందట్లేదని ఆందోళన చెందవద్దని... ప్రాధాన్యతా క్రమంలో అందరికి వ్యాక్సిన్​ను అందస్తామన్నారు.

ఇదీ చదవండి: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తెరాస, ఈటల వర్గాల మధ్య రసాభాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.