జేఎన్యూ జరిగిన ఘటనపై పోలీసులు విచారిస్తున్నారని... వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తారని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయమంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.
సీఏఏ వల్ల భారత ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదని హైదరాబాద్ బేగంపేటలో ఎస్సీ డెవలెప్మెంట్ అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రయోజనాల కోసమే సీఏఏపై రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు అవసరమైన ఉపకార వేతనాలు, బోధనా రుసుములు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో జరిగే పురపాలిక ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తోందని ప్రకటించారు. ముందుగా భాజపాతో చర్చించి.. సీట్లు కేటాయిస్తే కలిసి పోటీ చేస్తామని... లేదంటే తమ అభ్యర్థులు బలంగా ఉన్న చోట పోటీ చేస్తారన్నారు.
ఇదీ చదవండిః 'మంత్రి రాలేదని... హరితహారం మొక్కల్ని వదిలేశారు'