కాంగ్రెస్ పార్టీ బాబు జగ్జీవన్‌రామ్‌కు వెన్నుపోటు పొడిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్‌రామ్ 114వ జయంతి పురష్కరించుకుని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద పలువులు ప్రముఖులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
జగ్జీవన్‌రామ్‌కు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. భాజపా హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉన్నత పదవులు కట్టబెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాములు నాయక్, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ సేవలను స్మరించుకున్నారు.
ఇదీ చూడండి: జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి : మంత్రి ఈటల