వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం తాటాకు చప్పుళ్లకు భాజపా భయపడదన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని విమర్శించారు. హైదరాబాద్ చంపాపేట్‌లో భాజపా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో భాజపాను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదన్నారు. భాజపాపై కక్ష కట్టిన పార్టీలకు త్వరలోనే గుణపాఠం చెబుతామని కేంద్రమంత్రి హెచ్చరించారు.
మోసం చేయడమే కేసీఆర్ తెచ్చిన మార్పు
సచివాలయానికి రాకుండా పాలన చేయటం.. అన్ని వర్గాలను మోసగించడమే కేసీఆర్ తెచ్చిన గుణాత్మక మార్పు అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ధాన్యం కొనేది కేంద్రమేనని రైతులకు అర్థమైందని తెలిపారు. పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి భాజపా ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
'మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరుగుతా ఉన్నావు. ఎవరెవరినో బతిమాలాడి కలుస్తా ఉన్నావు. అయినా మాకేం భయం లేదు. మేం భయపడే వాళ్లం కాదు. తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదు. మాది మీలా కుటుంబ పార్టీ కాదు. మాది కార్యకర్తల పార్టీ. దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ. భాజపాను దేశం నుంచి తరిమికొట్టే శక్తి ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేదు.'
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ఇదీ చూడండి: