ETV Bharat / state

కేసీఆర్​లో అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందన్న కిషన్​ రెడ్డి - kishan reddy on cm kcr

Kishan Reddy fire on CM KCR అధికారం చేజారిపోతుందనే అభద్రతాభావం ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్​ అహంకారానికి ఇప్పటికే హుజూరాబాద్​ ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By

Published : Aug 23, 2022, 4:21 PM IST

Updated : Aug 23, 2022, 5:20 PM IST

Kishan Reddy fire on CM KCR సీఎం కేసీఆర్‌ది నిజాం తరహా నియంతృత్వ పాలన అని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి అసహనం, అభద్రతాభావం పెరిగిపోతోందన్నారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. భాజపా కార్యకర్తలపై దాడులు చేయాలని సీఎం కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబపాలన నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అని ఆయన గుర్తుంచుకోవాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు.

బండి సంజయ్‌ యాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కేసీఆర్‌ది నిజాం తరహా నియంతృత్వ పాలన. హుజూరాబాద్‌లో అహంకారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కేసీఆర్‌కు అసహనం, అభద్రతాభావం పెరిగిపోయింది. తెలంగాణ ప్రజలు కుటుంబ, అవినీతి పాలన వ్యతిరేకిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత వచ్చింది. ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మోదీపై ఆరోపణలు.- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

ఇప్పటికే హుజురాబాద్‌లో కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు ఓడించారని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ, అవినీతి పాలన వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెజార్టీ తెరాస కార్యకర్తలు అధికారం ఉందని మాత్రమే ఆ పార్టీలో ఉన్నారన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ చేతకాదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పకుందని కిషన్​ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మాట్లాడుతున్న భాష అసహ్యంచుకునేలా ఉందన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం వంతుల వారీగా మోదీని విమర్శిస్తున్నారని.. ప్రధాని ఏనాడు కేసీఆర్​పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ మాదిరిగా దిగజారి ప్రవర్తించరని.. కేసీఆర్ కుటుంబ పర్యవేక్షణలో ఆయుధాలతో సంజయ్ యాత్రపై దాడి చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు.

కుట్రలో భాగంగానే సంజయ్​ని అరెస్ట్ చేశారని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని తెలంగాణ పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. మునుగోడు సమరభేరి సభకు జనం రాకుండా పోలీసులు అడ్డుకున్నారని.. భాజపా సభకు వచ్చిన జనాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారని తెలిపారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని.. అలాగే తెలంగాణలో ఎట్లైతే సూర్యుడు ఉదయిస్తడో.. భాజపా అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్, తెరాస శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని కిషన్​ రెడ్డి హితవు పలికారు. శాంతి భద్రతల పేరుతో జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి భాజపాలో చేరేందుకే మునుగోడులో సభ పెట్టామని.. కేసీఆర్ ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా అధికారంలో ఉండే ఆర్నెల్లైనా మంచిగా పాలించండని సూచించారు. గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి.. ప్రధాన మంత్రిని అవమానిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ఒక్కటే తెలంగాణ కోసం పోరాటం చేయలేదన్నారు.

భాజపా దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అలంభిస్తోందని కిషన్​ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాదయాత్రకు అనుమతి లేదని బండి సంజయ్​కి నోటీసులు ఇవ్వడం సీఎం పిరికితనానికి నిదర్శనమన్నారు. అలాంటి వాటిని భాజపా ఖాతరు చేయదని స్పష్టం చేశారు.

ఈడీ దాడులపై తప్పుడు ప్రచారం: దిల్లీలో జరిగిన విచారణకు సంబంధించి అక్కడి నేతలు మాట్లాడారని.. ఈడీ సీబీఐ తమ పని చేసుకుంటూ పోతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈడీ,సీబీఐ ఏ దాడులు చేసిన నరేంద్ర మోదీ చేయిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఎవరి మీద దర్యాప్తు చేయాలనేది మోదీ పని కాదని... ప్రధాన మంత్రికి దేశానికి సంబంధించిన అనేక పనులుంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో దేశభక్తికి సంబంధించిన పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవిని పిలిచిన విషయం గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిని ఒకే సందర్భంలో పిలవడం కుదరదని కిషన్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి: రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం

కళ్లు లేకున్నా కుటుంబానికి అండగా, మైక్రోసాఫ్ట్​లో​ ఉద్యోగం, లక్షల్లో జీతం

Last Updated : Aug 23, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.