తెలంగాణను ఎవరూ విస్మరించలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. కరోనా సమయం నుంచి తెలంగాణకు కేంద్రం సముచిత న్యాయం చేసిందని ఆయన వివరించారు. హైదరబాద్‌లోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్... కొవిడ్ సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే నిత్యావసర సరకులు అందించామని అన్నారు. మోదీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా బడ్జెట్‌ను రూపొందించిందన్న అనురాగ్... అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తుందని వివరించారు.
తెలంగాణను ఎవరూ విస్మరించలేరు. కొవిడ్ సమయంలోనూ సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళ్లాం. మెట్రో, నీళ్లు, విద్య, రహదారుల కోసం కేటాయింపులు జరిగాయి. తెలంగాణలో 2,111 కి.మీ మేర 53 రోడ్డు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటికోసం రూ. 20,800 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఇది తక్కువ వ్యయమేమీ కాదు. రూ. 29వేల కోట్లకుపైగా రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.
--- అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
ఇదీ చూడండి: ఈనాడులో దివ్యాంగుడి కథనం... సుమోటోగా తీసుకున్న హెచ్చార్సీ