ETV Bharat / state

Regional Ring Road in Hyderabad : ఆర్ఆర్ఆర్​ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

Regional Ring Road in Hyderabad: ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు పడింది. దీనిపై కేంద్రం తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదట ఉత్తరభాగాన్ని నిర్మించనున్నారు. 113 గ్రామాల మీదుగా ఈ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగనుంది.

RRR
ఆర్ఆర్ఆర్​ గెజిట్ నోటిఫికేషన్
author img

By

Published : Apr 2, 2022, 7:05 AM IST

Updated : Apr 2, 2022, 7:52 AM IST

Regional Ring Road in Hyderabad : హైదరాబాద్‌ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో మరో ముందడుగు పడింది. రహదారి ఉత్తరభాగం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాతో కేంద్రం తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- జగ్‌దేవ్‌పూర్‌- భువనగిరి- చౌటుప్పల్‌ మీదుగా ఉత్తరభాగం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ భాగం 158.645 కిలోమీటర్ల మేర సాగుతుంది. భారత్‌మాల పరియోజన కింద కేంద్ర నిధులతో హరిత రహదారిగా నిర్మించనున్న దీనికి భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. నిర్మాణం మొత్తం కేంద్ర నిధులతో సాగుతుంది. పూర్తి ఎక్స్‌ప్రెస్‌ వేగా, రెండు భాగాలుగా నిర్మించే 344 కిలోమీటర్ల మార్గంలో.. ఉత్తర భాగానికి కేంద్రం గత ఏడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ నంబరు కేటాయించాల్సి ఉంది.ఉత్తర భాగం భూసేకరణకు అనుమతి లభించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను గుర్తించనున్నారు.

భూములను గుర్తించిన తరువాత ఆ వివరాలతో మరో దఫా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో 113 గ్రామాలను పేర్కొన్నారు. మెదక్‌ జిల్లాలో 34 గ్రామాలు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 35, సిద్దిపేటలో 24, సంగారెడ్డి జిల్లాలో 20 గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టిన తరువాత సాంకేతికంగా జారీ చేసే నోటిఫికేషన్‌లో గ్రామాల తుది జాబితా ఖరారవుతుందని అధికారిక సమాచారం.

యాదాద్రి-భువనగిరి జిల్లా...
చౌటుప్పల్‌ ఆర్డీవో పరిధిలోని గ్రామాలు: చిన్నకొండూరు, చౌటుప్పల్‌, లింగోజిగూడెం, పంతంగి, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగడపల్లి (చౌటుప్పల్‌ మండలం), వర్కట్‌పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, పహిల్వాన్‌పూర్‌, కంచనపల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక (వలిగొండ మండలం).
భువనగిరి ఆర్డీవో పరిధి: రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికలపహాడ్‌, తుక్కాపూర్‌, చందుపట్ల, గౌస్‌నగర్‌, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి మండలం).
యాదాద్రి-భువనగరి అదనపు కలెక్టర్‌ పరిధి:: మల్లాపురం, దాతార్‌పల్లి (యాదగిరిగుట్ట మండలం). గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కొండాపూర్‌/కోనాపూర్‌, ఇబ్రహీంపూర్‌, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి మండలం).

సిద్దిపేట జిల్లా...
గజ్వేల్‌ ఆర్డీవో పరిధి: బేగంపేట, ఎల్‌కల్‌ (రాయపోల్‌ మండలం). బంగ్లా వెంకటాపూర్‌, మక్తామాసాన్‌పల్లి, కోమటిబండ, గజ్వేల్‌, సంగాపూర్‌, ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌, శ్రీగిరిపల్లె, పాములపర్తి (గజ్వేల్‌ మండలం). మజిద్‌పల్లి, నెంటూరు, జబ్బాపూర్‌, మైలారం, కొండాయిపల్లి (వర్గల్‌ మండలం). మర్కూక్‌, పాములపర్తి, అంగడి కిష్టాపూర్‌, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్‌ మండలం). ఆలిరాజ్‌పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్‌దేవ్‌పూర్‌ మండలం).

మెదక్‌ జిల్లా...
తూప్రాన్‌ ఆర్డీవో పరిధి: వట్టూరు, జండపల్లి, నాగులపల్లి, ఇస్లాంపూర్‌, దాతర్‌పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్‌, వెంకటాయిపల్లి, కిష్టాపూర్‌, తుప్రాన్‌, నర్సంపల్లి, (తూప్రాన్‌ మం). నర్సాపూర్‌ ఆర్డీవో పరిధి: వెంకటాపూర్‌ (కౌడిపల్లి). లింగోజిగూడ, పాంబండ, పోతులబొగుడ, కొంతాన్‌పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్‌, కొత్తపేట(శివ్వంపేట్‌ మం.). నాగులపల్లి, మూసాపేట, మహ్మదాబాద్‌/జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిరుమలాపూర్‌, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట, సీతారాంపూర్‌, రుస్తుంపేట, మంతూర్‌, మల్‌పర్తి, తుజాల్‌పూర్‌ (నర్సాపూర్‌).

సంగారెడ్డి జిల్లా...
సంగారెడ్డి ఆర్డీవో పరిధి: సంగారెడ్డి, నాగాపూర్‌, ఇరిగిపల్లి, చింతలపల్లి, కల్పగూర్‌, తాళ్లపల్లి, కుల్పగూర్‌ (సంగారెడ్డి మండలం). పెద్దాపూర్‌(సదాశివపేట మండలం). కాసాల, దేవులపల్లి, హత్నూర, దౌల్తాబాద్‌ కొత్తపేట, సికిందర్‌పూర్‌(హత్నూర్‌ మండలం).
ఆందోల్‌-జోగిపేట ఆర్డీవో పరిధి: శివంపేట, వేండికోల్‌, అంగడికిష్టాపూర్‌, లింగాపల్లి, కోర్పోల్‌(చౌటకూర మండలం). గిర్మాపూర్‌, మల్కాపూర్‌ (కొండాపూర్‌ మండలం)

ఇదీ చూడండి : ఏప్రిల్‌, మే నెలల్లో పెళ్లిళ్ల సందడి.. ఒక్కటవ్వనున్న 90 వేల జంటలు

Last Updated : Apr 2, 2022, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.