Central on Paddy Procurement: రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదని కేంద్రం స్పష్టం చేసింది. కనీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్ ధరల మేరకు వడ్లు తీసుకుంటామన్న కేంద్రం ఎఫ్‌సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం ధాన్యం సేకరిస్తామని పునరుద్ఘాటించింది. ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయని కేంద్రం వివరించింది. పరిస్థితుల ఆధారంగా సేకరణ జరుగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్‌సీఐ గోధుమ, వరిధాన్యాలను నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తాయని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ఎంఎస్పీకి ముడి ధాన్యం సేకరణ జరుగుతుందన్న కేంద్రం.. ఎఫ్‌సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం సేకరణ ఉంటుందని వెల్లడించింది. సేకరించిన ధాన్యం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ జరుగుతుందని లోక్సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ జరుగుంతుందని కేంద్రం ఈ సందర్భంగా వివరించారు.
ఇదీ చదవండి: