ETV Bharat / state

Central Government on AIBP Projects: 'ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి' - రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌

Central Government on AIBP Projects: సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రాష్ట్రానికి సంబంధించిన 11 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 8 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటి పనులు వెేగంగా పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని రాష్ట్ర అధికారులు కేంద్రానికి తెలిపారు.

accelerated irrigation benefit project, aibp projects in ts
ఏఐబీపీ ప్రాజెక్టులు
author img

By

Published : Nov 30, 2021, 7:43 AM IST

Central Government on AIBP Projects: సత్వర సాగునీటి ప్రయోజన పథకం(పీఎంకేఎస్‌వై- ఏఐబీపీ-Accelerated Irrigation Benefit Project) కింద రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సోమవారం సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌లతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. దేవాదుల, పాలెంవాగు, పెద్దవాగు, నీల్వాయి, బీమా-2, కుమురం భీం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ-2, ఇందిరమ్మ వరద కాలువల పనులు, నిధుల వినియోగంపై సమీక్షించారు. ఇప్పటికే 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని రాష్ట్ర అధికారులు వివరించినట్లు సమాచారం.

ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ఏఐబీపీ పథకం రెండో దశలో మరికొన్ని ప్రాజెక్టులకు అవకాశం కల్పించే విషయమై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇందుకు ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని కేంద్రం సూచించినట్లు సమాచారం.

ఏఐబీపీ కింద తెలంగాణలోని దేవాదుల, శ్రీరామసాగర్‌ వరదకాలువ, శ్రీరామసాగర్‌ రెండోదశ, రాజీవ్‌భీమా, కుమురంభీం, గొల్లవాగు, రాలివాగు, మత్తడివాగు, నీల్వాయి, పాలెంవాగు, పెద్దవాగు జగన్నాథపూర్‌ ఉన్నాయి. ఇందులో కొన్ని 2008 నుంచి కేంద్ర పథకం పరిధిలో ఉన్నాయి.

ఏఐబీపీ గ్రాంటుకు కాళేశ్వరం ఆయకట్టు ప్రతిపాదనలు!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇంకా పూర్తికాని ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణాలు, స్ట్రక్చర్ల నిర్మాణాలను ఏఐబీపీ కింద ప్రతిపాదించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ దస్త్రాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. జలాశయాల కింద మిగిలి ఉన్న పనుల అంచనాలు, కావాల్సిన నిధుల వివరాలను సిద్ధం చేసి కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించేందుకు సీఈల నుంచి ఈఎన్‌సీ హరిరాం ప్రతిపాదనలు తీసుకున్నట్లు తెలిసింది. వీటికి ఆమోదం లభిస్తే గ్రాంటు రూపంలో వచ్చే నిధులతో మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: CM KCR ON YASANGI: 'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.