పీజీ వైద్య విద్యార్థులు జిల్లా ఆస్పత్రుల్లో మూడు నెలలపాటు పనిచేయటం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గెజిట్ను విడుదల చేసింది. పీజీలో వైద్య సేవలకు జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసిన అనుభవం తోడుకావాల్సి ఉందని అభిప్రాయపడింది.
2020 మెడికల్ పీజీ కోర్సుల్లోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక ఈ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ద్వారా సేవ చేస్తూనే ప్రజారోగ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య విధానాలు, జిల్లాల్లో అందిస్తున్న వైద్య సేవలకు సంబంధిచిన అనుభవం పీజీలకు వస్తుందని ఎంసీఐ అభిప్రాయపడింది. ఇందులో భాగంగా కనీసం వంద పడకలు ఉన్న జిల్లా ఆస్పత్రుల్లో పీజీలు పనిచేయాల్సి ఉంటుందని ప్రకటించింది.
ఇదీ చూడండి : గెలుపే లక్ష్యంగా... జోరందుకున్న ఎన్నికల సమావేశాలు