గ్రేటర్ ఓట్ల లెక్కింపులో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతున్న హాల్లోకి అనుమతిలేకుండా ఎంఐఎం అభ్యర్థి బేగం భర్త మహమ్మద్ షరీఫ్ సెల్ ఫోన్ తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. మహమ్మద్ షరీఫ్‌ను పోలీసులు బయటకు పంపించారు. అనంతరం పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో షరీఫ్‌ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఇదీ చదవండి: 42 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం