ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ప్రకటించిన విరాళాలను పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి సంబంధిత చెక్కులను అందజేశారు.
మైహోం గ్రూప్ తరఫున ఆ సంస్థ డైరెక్టర్ రామ్ రూ. 5 కోట్ల చెక్‌ను అందించారు. సినీనటులు చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ. 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. దక్కన్ సిమెంట్స్ సంస్థ రూ. 25 లక్షల విరాళం అందించింది.
ఇదీ చదవండి: కేంద్రం నుంచి నయాపైసా కూడా సాయం అందలే: కేసీఆర్