ETV Bharat / state

'జీవితానికి.. కథకు పెద్ద తేడా ఉండదు'

Author Sujatha Reddy Launched 'Katha 2021' Book: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆర్థిక సహకారంతో.. కథాసాహితీ 1990 నుంచి ఉత్తమ కథలను పాఠకులకు అందిస్తోంది. ఆ సంకలనాల పరంపరలో భాగంగా 32వ ‘కథ-2021’ ఆవిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దీనిని రచయిత్రి డా.ముదిగంటి సుజాతారెడ్డి ఆవిష్కరించారు.

Celebrities Who Launched Katha 2021 Book

author img

By

Published : Dec 18, 2022, 12:47 PM IST

Updated : Dec 18, 2022, 12:54 PM IST

'జీవితానికి.. కథకు పెద్ద తేడా ఉండదు'

Author Sujatha Reddy Launched 'Katha 2021' Book: ‘జీవితానికి... కథకు పెద్దగా తేడా ఉండదు. సమాజాన్ని, జాతి సంస్కృతిని, జీవన విధానాన్ని, మన మూలాల్ని తెలియజేసేది, ముందు తరాలకు అందించేదే సాహిత్యం’ అని ‘కథ 2021’ ఆవిష్కరణ సభలో వక్తలు ఉద్ఘాటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆర్థిక సహకారంతో.. కథాసాహితీ 1990 నుంచి ఉత్తమ కథలను పాఠకులకు అందిస్తోంది. ఆ సంకలనాల పరంపరలో భాగంగా 32వ ‘కథ-2021’ ఆవిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. రచయిత్రి డా.ముదిగంటి సుజాతారెడ్డి ‘కథ 2021’ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ చేస్తున్న సాహిత్య సేవలో ‘తానా’కు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూడేళ్ల క్రితం వచ్చిన శూన్యం మామూలుది కాదని, ఆ శూన్యమంతా ఈ కథలో ప్రతిబింబిస్తోందని అన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆచార్యురాలు కె.సునీతారాణి పుస్తకాన్ని సమీక్షించారు. తానా 23వ మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆత్మీయ ప్రసంగం చేశారు. కథాసాహితీ సంపాదకులు వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ‘కథ 2021’ సంకలనంలోని రచయితలు తమ కథ నేపథ్యాన్ని వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2022, 12:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.