ETV Bharat / state

ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి.. కుటుంబసభ్యులు సహా ప్రముఖుల నివాళులు - nandamuri family tribute to ntr

NTR 27th Death Anniversary : నేడు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబసభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్​ వద్ద బాలకృష్ణ, తారక్, కల్యాణ్​రామ్​లతో పాటు మరికొందరు పుష్పగుచ్ఛాలు ఉంచి ఎన్టీఆర్​ను స్మరించుకున్నారు.

ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి
ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి
author img

By

Published : Jan 18, 2023, 9:38 AM IST

Updated : Jan 18, 2023, 11:34 AM IST

NTR 27th Death Anniversary : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు.. పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.

....

Balakrishna Tribute to NTR : ఎన్టీఆర్​ ఘాట్ వద్ద​కు చేరుకున్న బాలకృష్ణ తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని తెలిపారు. ఎంతోమందికి రాజకీయ ఓనమాలు నేర్పారన్న ఆయన.. ఎన్టీఆర్​ ఓ పొలిటికల్​ హీరో అని వ్యాఖ్యానించారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదని.. ఒక వ్యవస్థ అన్న బాలకృష్ణ.. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీని స్థాపించి ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పారు. ఎన్నో సాహసోపేతమైన పథకాలు తెచ్చారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదు ఒక వ్యవస్థ. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలి. - బాలకృష్ణ

ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి

ఎన్టీఆర్​ పేరు చిరస్మరణీయం..: టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​, పొలిట్​బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్​ రెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు జోశ్న ఎన్టీఆర్​ ఘాట్​లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్​ చేసిన సేవ చిరస్మరణీయమని కాసాని పేర్కొన్నారు. వర్ధంతి కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. దేశ రాజకీయాలను ఎన్టీఆర్ ప్రభావితం చేశారన్న రావుల చంద్రశేఖర్​రెడ్డి.. దేశాన్ని సంక్షేమ బాట పట్టించిన మహనీయుడని కొనియాడారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్​కు నివాళులర్పించారు.

ఇవీ చూడండి..

NTR Ghat LIVE: ఎన్టీఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం

దిల్లీని వణికిస్తున్న చలి.. పొగమంచుతో విమానాలు, రైళ్లు ఆలస్యం

Last Updated : Jan 18, 2023, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.