సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తెలంగాణలో మొదటిసారి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో 182 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా ఐదు కోట్ల రూపాయలతో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఘట్కేసర్లో ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా రక్షణ కోసం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుధా నారాయణమూర్తి అన్నారు. మహిళా రక్షణ కోసం షీ బృందాలు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఇవీ చదవండి:ఏటీఎం మాయగాడు