ETV Bharat / state

సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంటున్న అధికారి - srikakulam district updates

అధికారులు ఒకటికి రెండు సార్లు ఎవరూ చూడట్లేదు కదా నిర్ణయించుకున్నాకే లంచాలు తీసుకుంటారు. కానీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి మాత్రం సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

CC is an officer who shows to the camera and takes too many bribes
సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంటున్న అధికారి
author img

By

Published : Feb 7, 2021, 11:20 AM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో ఓ అధికారిణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం ఆమె సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకోవడమే. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి 18 ఏళ్లుగా పని చేస్తున్నారు. మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఆమెపై ఉన్నాయి.

బి.కుసుమ కుమారి పని తీరుపై విమర్శలు రావడంతో ఇటీవల అధికారులు సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్​ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ మీడియాకు తెలిపారు.

సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంటున్న అధికారి

ఇదీ చదవండి: నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్​'పై స్పష్టత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.