ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద... శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం దృశ్యాలు... సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వివాహం అనంతరం కుటుంబ సభ్యులందరూ... ఇళ్లకు వెళ్లేందుకు వాహనం ఎక్కారు. పెళ్లి మండపం దగ్గర ఉన్న కానుకలు, ఇతర సంచులు వ్యానులో సర్దే క్రమంలో వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. వాహనంలో ఉన్న ముగ్గురు కిందకు దూకేశారు. మిగిలిన వారు మృతిచెందారు.
ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రవాణా శాఖ అధికారులు తేల్చారు. ప్రయాణికులు వాహనం ఎక్కిన తర్వాత న్యూట్రల్లో పెట్టి హ్యాండ్ బ్రేక్ వెయ్యక పోవడమే కారణమని నిర్ధరించారు. 15 అడుగుల పైనుంచి మెట్ల మీదుగా వాహనం కిందకు బోల్తా కొట్టింది. ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరుడి సోదరి ఈ తెల్లవారుజామున మృతి చెందింది. మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ఘటనతో కొండపైకి వాహనాలను నిషేధించారు. ఇవాళ ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: యువకునిపై కత్తితో దాడి... పరిస్థితి విషమం