నగరంలో దుకాణాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల భద్రతకు మరింత భరోసా ఉంటుందని రామ్గోపాల్ పేట ఎస్సై టీసీహెచ్ బాబు అన్నారు. ప్యారడైజ్ సమీపంలోని దుకాణాల యజమానులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. దుకాణాల యజమానులు కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఐ కాశీ, ఎస్సై ప్రతాప్ రెడ్డి దుకాణాల యజమానులు పాల్గొన్నారు.