ETV Bharat / state

దిల్లీ మద్యం కుంభకోణం కేసు... ఆ ఇద్దరికి బెయిల్ - దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ

Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌లకు బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.

Delhi liquor scam case
Delhi liquor scam case
author img

By

Published : Nov 14, 2022, 4:16 PM IST

Updated : Nov 14, 2022, 4:34 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌లకు బెయిల్ మంజూరైంది. ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు.. సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఈడీ కస్టడీకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు 5 రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అభిషేక్, విజయ్ నాయర్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించారు. ఈడీ కస్టడీలో ఉన్నపుడు కుటుంబీకులు కలిసేందుకు ప్రత్యేక కోర్టు అవకాశం ఇచ్చింది. తన తల్లిని కలిసేందుకు అభిషేక్‌కు కోర్టు అంగీకరించింది.

ఇవీ చూడండి:

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో తనిఖీలు

Last Updated : Nov 14, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.