ETV Bharat / state

ఈడీ కేసుల విచారణ ముందే చేపట్టొచ్చు : సీబీఐ కోర్టు - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నమోదు చేసిన కేసులు వేర్వేరని సోమవారం సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై ముందుగానే విచారణ చేపట్టవచ్చని స్పష్టం చేసింది.

cbi-court-on-ap-cm-jagan-illegal-assets-case
ఈడీ కేసులపై ముందే విచారణ: సీబీఐ కోర్టు
author img

By

Published : Jan 12, 2021, 12:29 PM IST

సీబీఐ కేసుల తరువాతే ఈడీ కేసులను విచారణ చేపట్టాలంటూ జగతి పబ్లికేషన్స్‌, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలను విన్న సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు గత నెల 15న ఉత్తర్వులు వాయిదా వేశారు. సోమవారం ఉత్తర్వులు వెలువరిస్తూ నిందితులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కొట్టివేశారు.

'ఈడీ కేసులకు ఆధారం సీబీఐ కేసులే. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాల ఆధారంగానే ఈడీ ఫిర్యాదులు నమోదు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి తీసుకువచ్చిన సవరణ ప్రకారం రెండు కేసులను ఒకే కోర్టులో విచారణ చేపట్టాలి. సీబీఐ కేసు విచారణ తరువాతే ఈడీ కేసు విచారణ చేపట్టాలి.' అని నిందితుల తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై సత్వరం విచారణ చేపట్టాలని, రెండు కేసుల్లోని అభియోగాలు వేర్వేరన్న ఈడీ తరఫు న్యాయవాది టి.వి.సుబ్బారావు వాదనతో ఏకీభవించారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి తీసుకువచ్చిన సవరణ నేపథ్యంలో సీబీఐ కేసు కంటే ఈడీ కేసుపై ముందుగా విచారణ చేపట్టవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన 6 కేసుల్లో విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.

హాజరైన విజయసాయిరెడ్డి

అరబిందో, హెటిరో భూకేటాయింపుల వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసు నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు నుంచి ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కేసులోని పలువురు నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి, అరబిందో ఛైర్మన్‌ పి.వి.రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ ఎండీ శరత్‌చంద్రారెడ్డిలు హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించారు. రెండో నిందితుడైన వైకాపా ఎంపీ వి.విజయసాయిరెడ్డి, అరబిందో నిత్యారెడ్డి, కె.ప్రసాద్‌రెడ్డి, కె.రాజేశ్వరి, పి.ఎస్‌.రాజమౌళి, వై.వి.ఎల్‌.ప్రసాద్‌, హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.