ETV Bharat / state

వివేకాను చంపింది వాళ్లే... దాని కోసమే ఇదంతా: సీబీఐ - వివేక హత్య కేసు సీబీఐ

CBI on Viveka murder case తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నిందితులు ఎవరో సీబీఐ కనిపెట్టింది. సునీల్‌, ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేసినట్లు సీబీఐ తమ నివేదికలో పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని.. అందుకే హత్య చేసినట్లు సీబీఐ తేల్చింది.

CBI counter filed in Telangana High Court on Viveka murder case accused Sunil bail petition
సునీల్‌, ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేశాడు: సీబీఐ
author img

By

Published : Feb 22, 2023, 9:46 PM IST

Updated : Feb 23, 2023, 6:40 AM IST

CBI on Viveka murder case వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వివేకాను సునీల్ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడన్న సీబీఐ... హత్య జరిగిన రాత్రి సునీల్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని పేర్కొంది. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందన్న సీబీఐ.... ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని వివరించింది.

ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని వివేకా కోరినట్లు సీబీఐ వెల్లడించింది. వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని... శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. వివేకా రాజకీయ ప్రణాళికలు అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని ప్రస్తావించిన సీబీఐ.... సాక్ష్యాల ప్రకారం శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌ కుట్రపన్నినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారన్న సీబీఐ.. వివేకా గుండెపోటుతో మరణించినట్లు అవినాష్‌రెడ్డి స్థానిక సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపింది.

"సునీల్‌ యాదవ్, ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేశాడు. హత్య రోజు రాత్రి సునీల్.. అవినాష్, భాస్కర్‌రెడ్డి ఇంటికెళ్లాడు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరం ఉంది. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకివ్వాలని వివేకా కోరారు. ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని కోరారు. వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదు. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది." - సీబీఐ

అవినాష్‌రెడ్డి 90002 66234కు ఫోన్‌ చేసి కాసేపు మాట్డాడినట్లు తేల్చింది. సుమారు 6 నిమిషాలు మాట్లాడినట్లు తెలిపింది. అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వివేకా హత్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందన్న సీబీఐ…. కుట్రలో భాగంగానే గుండె, రక్తవిరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోందని పేర్కొంది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారన్న సీబీఐ.. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టారని తేల్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 23, 2023, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.