ETV Bharat / state

మీ ఒంట్లో అది ఉంటేనే... మీరు ఓకేనట! - డి విటమన్​ ఎంతవరకు అవసరం అంటే

చిన్నపనికే అలసట. నాలుగు మెట్లు ఎక్కి దిగితే కండరాల నొప్పులు. జుట్టు రాలిపోవడం, చర్మం నిగారింపు తగ్గిపోవడం.... అంతెందుకు తరచూ జలుబు, జ్వరం, ఇతరత్రా అనారోగ్యాలు.. ఇబ్బంది పెడుతున్నాయా.? అయితే.. మీ ఒంట్లో విటమిన్‌ డి తగ్గిందేమో గమనించుకోండి. అసలెందుకు ఇది లోపిస్తుంది? దీన్నెలా భర్తీ చేసుకోవాలి వంటివన్నీ తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.

Causes and precautions for d vitamin deficiency in Telugu
మీ ఒంట్లో ‌ ‘డి’ ఉంటేనే... మీరు ఒకే..!
author img

By

Published : Jun 3, 2020, 4:44 PM IST

Updated : Jun 3, 2020, 5:07 PM IST

ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి విటమిన్‌-డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. మారిన జీవనశైలి కారణంగా కనీస ఎండ పొడ తగలకుండా... ఏసీ, చీకటి గదుల్లో గడిపేస్తున్నవారే ఎక్కువ. దాంతో చాలామందిలో ఇప్పుడు విటమిన్‌ డి లోపం కనిపిస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్లా కొందరిలో ఇది లోపిస్తుంది. శారీరక శ్రమ తక్కువ చేసేవారిలోనూ ఇది లోపిస్తోంది. ఈ విటమిన్‌ సరైన మోతాదులో శరీరానికి అందినప్పుడే అందం, అరోగ్యం.

ఎందుకు అవసరం?

రోజూ కనీసం 400 ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం. ఇది ప్రధానంగా సూర్యరశ్మి నుంచి అందుతుంది. దాంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్‌ క్యాల్షియం, ఫాస్ఫరస్‌లను శరీరం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండూ ఎముక నిర్మాణానికి కావాల్సిన అత్యావశ్యక మూలకాలు. అందుకే ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్‌ అవసరం. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. వాపులను తగ్గిస్తుందని కొన్ని ప్రయోగ పరిశోధనలు చెబుతున్నాయి. రోగకారక క్రిములతో పోరాడే టీ-కణాలు, రోగనిరోధక కణాల పనితీరును విటమిన్‌-డి మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను తగ్గిస్తుంది. బరువు నియంత్రణకు సాయపడుతుంది.

విటమిన్‌-డి లోపిస్తే...

విటమిన్‌-డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్నారుల్లో రికెట్స్‌తో పాటు, శ్వాసకోస సంబంధ సమస్యలూ ఎదురవుతాయి. పెద్దల్లో దగ్గు, జలుబు, కారణం లేకుండా వచ్చే ఒళ్లునొప్పులు వంటివీ కనిపిస్తాయి. మహిళల్లో ఆస్టియో పోరోసిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణుల్లో విటమిన్‌-డి లోపిస్తే మధుమేహం వంటి సమస్య ముప్పుతో పాటు పాపాయి తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఎదుగుదలలో లోపాలు ఉండొచ్చు.

వేటి నుంచి లభిస్తుంది?

చేపలు, చేప నూనెలు (కాడ్‌ లివర్‌ ఆయిల్‌), గుడ్డు పచ్చసొన, చీజ్‌, కాలేయం, చికెన్‌, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, సూక్ష పోషకాలు కలిసిన నూనెలు(ఫోర్టిఫైడ్‌), చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వుల నుంచి విటమిన్‌-డి అందుతుంది.

లభించే పదార్థాలు:

  • మాంసాహారం: కాలేయం, చేపలు
  • ఆకుకూరలు: తోటకూర, మునగాకు
  • చిరుధాన్యాలు: మొక్కజొన్న, రాగులు
  • పప్పులు: సోయా, రాజ్మా, బొబ్బర్లు
  • కూరగాయలు: బీన్స్‌, టమాట
  • పండ్లు: దానిమ్మ, రెజిన్స్‌, బొప్పాయి
  • సుగంధద్రవ్యాలు: లవంగాలు, యాలకులు

ఇదీ చూడండి: తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం

Last Updated : Jun 3, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.