ETV Bharat / state

Caste less Society Of India: 'సమసమాజ నిర్మాణానికి ఈ వివాహాలు చాలా అవసరం' - హైదరాబాద్​లో కుల నిర్మూలన సంఘం సమావేశం

Caste less Society Of India: సమసమాజ నిర్మాణం కోసం కులాంతర, మతాంతర వివాహలు చేయడం చాలా అవసరమని మాజీ పార్లమెంట్‌ సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. కులాంతర వివాహాలు శాస్త్రీయమైనవని పేర్కొన్నారు. వారికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు వహీద్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల నిర్మూలన సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Caste less Society Of India
కుల నిర్మూలన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు
author img

By

Published : Apr 24, 2022, 8:42 PM IST

Caste less Society Of India: ప్రస్తుత సమాజంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించడం చాలా అవసరమని మాజీ పార్లమెంట్‌ సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల నిర్మూలన సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కులాంతర వివాహలు శాస్త్రీయమైనవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కులాంతర, మతాంతర చేసుకున్న వారిని సన్మానించారు.

Caste less Society Of India
కులాంతర వివాహాల జంటకు సన్మానం

సమ సమాజ, ఆరోగ్య సమాజానికి కులాంతర వివాహాలు చాలా అవసరం. ఈ పెళ్లిళ్ల ద్వారా సోసైటీ ఒక ఆదర్శంగా నిలుస్తారు. ఇలాంటి వివాహాలు శాస్త్రీయమైనవి. అందరం కలిసి ఇలాంటి వివాహాలను ప్రోత్సహించాలి.

-బూర నర్సయ్యగౌడ్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు

Caste less Society Of India
కులాంతర వివాహాల జంటకు సన్మానం

కులాంతర, మతాంతర వివాహలు చేసుకున్న వారికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు వహీద్‌ డిమాండ్‌ చేశారు. కులాంతర వివాహలు చేసుకున్న వారిని ఆదర్శ భారతీయులుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా చేస్తే కుల రహిత రిజర్వేషన్ల వైపు యువత మొగ్గు చూపుతారని తెలిపారు. అప్పుడే నిజమైన కుల రహిత, ఆదర్శ సమాజం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కులాంతర, మతాంతర వివాహలు చేసుకున్న వారిలో కొంత మార్పు వస్తుందని.. కానీ పరువు హత్యలు జరగడం చాలా బాధకరమన్నారు. కుల నిర్మూల సమాజం కోసం జాతీయ స్థాయిలో అఖిల భారతీయ సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు వహీద్‌ తెలిపారు.

Caste less Society Of India
కుల నిర్మూలన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు

ఎన్నో అటుపోట్లను ఎదుర్కొంటూ వివాహాలు చేస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడే కులరహిత రిజర్వేషన్లు వైపు యువత వస్తారు. కులాంతర వివాహాలు చేసుకునే వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి.

- వహీద్, కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.