ETV Bharat / state

ఓటీపీ నమోదు చేస్తేనే రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరణ - OTP system for cash withdraws

ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు ఎస్​బీఐ ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ‘బ్యాంకులో నమోదైన మొబైల్‌ నంబరు’కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు మాత్రమే వీలవుతుందని స్పష్టం చేసింది.

ఓటీపీ నమోదు చేస్తేనే రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరణ

author img

By

Published : Jul 28, 2022, 11:04 AM IST

ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎంలో రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ‘బ్యాంకులో నమోదైన మొబైల్‌ నంబరు’కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే.. ఏటీఎం నుంచి నగదు బయటకు రాదని వెల్లడించింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది.

ఖాతాలో రూ.లక్షకు మించి ఉంటే, అపరిమిత ఉపసంహరణలు.. తమ బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.లక్ష కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదేవీలనే అనుమతిస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. అంతకు మించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.