ETV Bharat / state

'బిగ్​బాస్ షోను ఆపేయండి... దానివల్ల ఉపయోగం లేదు' - బిగ్​బాస్​పై హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్​బాస్ షోను నిషేధించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్​ దాఖలైంది. షో ద్వారా పిల్లలపై దుష్ప్రభావం పడుతోందని... పెద్దలు మానసిక ఆందోళనకు గురువుతున్నారని ఫిర్యాదు చేశారు.

case-against-of-bigg-boss-season-4-in-hrc
'బిగ్​బాస్ షో నిలిపివేయండి... దానివల్ల ఉపయోగం లేదు'
author img

By

Published : Aug 25, 2020, 8:39 PM IST

బిగ్​బాస్ సీజన్​-4ను నిలిపివేయాలని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో తెలంగాణ మహిళా హక్కుల వేదిక, పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యార్థి ఐకాస పిటిషన్ దాఖలు చేసింది. సమాజానికి ఈ షో ఏ మాత్రం ఉపయోగపడదని... మానవ సంబంధాలను, కుటుంబ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ షో ఉంటుందని వారు హెచ్​ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు.

'బిగ్​బాస్ షోను ఆపేయండి... దానివల్ల ఉపయోగం లేదు'

కొవిడ్-19తో దేశమంతా అల్లాడుతుంటుంటే... ఒకే హౌస్​లో 50మందికి పైగా నిబంధనలు ఉల్లంఘిస్తూ... నెలల తరబడి ఉండటం సమంజసం కాదన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అధిక ఫీజులు తగ్గించాలని ధర్నా చేస్తున్న తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు... బిగ్​బాస్ షో వ్యవహారం కనిపించట్లేదా అంటూ వారు ప్రశ్నించారు. ఇలాంటి షోలు యువతను, విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నాయని... వీటిని దృష్టిలో పెట్టుకుని బిగ్​బాస్ షో జరగకుండా నిలిపివేయాలని హెచ్​ఆర్సీని కోరారు.

ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.