ETV Bharat / state

ఆ ఖాకీల పనైపోయినట్టే - ఇక నుంచి సస్పెన్షన్ కాదు ఏకంగా కేసు నమోదు - Case Corrupted Cops

Case Against Corrupted Cops Telangana 2024 : తెలంగాణలో కొందరు ఖాకీలు పోలీసు శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోతున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకూ సస్పెన్షన్‌తో సరిపెడుతుండగా, ఇకపై కేసులు కూడా నమోదు చేయాలని ఆలోచిస్తోంది.

Cases Against Telangana Police 2023
Cases Against Telangana Police 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 2:17 PM IST

Case Against Corrupted Cops Telangana 2024 : రాష్ట్రంలో విధి నిర్వహణలో తప్పులు చేసే పోలీసుల ఆటలు కట్టించాలని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై క్రమశిక్షణ చర్యలతో పాటు, చట్టపరంగా కూడా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ సస్పెన్షన్‌తో మాత్రమే సరిపెడుతుండగా ఇకపై ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యే పక్షంలో, క్రిమినల్‌ కేసులు (Case Files On Police) కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులతోపాటు గతంలో నమోదైన వాటినీ సమీక్షించనున్నట్లు సమాచారం.

Police Case on Ex MLA Shakeel Son : పోలీసుల పనితీరుపై విమర్శలకు లెక్కలేదు. పైరవీలకు లొంగిపోయో, ఒత్తిడి తట్టుకోలేకో, లంచాలకు ఆశపడో కేసులను తారుమారు చేస్తారనే అపవాదులు తరచూ వస్తుంటాయి. ఇటీవల బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ (Ex MLA Shakeel Son) తన మిత్రులతో కలిసి కారుతో ప్రజాభవన్‌ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో నిందితులను తారుమారు చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట సీఐ దుర్గారావును అధికారులు సస్పెండ్‌చేశారు. ప్రలోభాలకు ఆశపడే దుర్గారావు, సాహిల్‌ డ్రైవర్‌ను నిందితునిగా చేర్చారన్నది ప్రధాన అభియోగం.

భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ

Cops Suspended in Telangana 2023 : పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ బాధితురాలితో అనుచితంగా ప్రవర్తించారన్నది మరో ఎస్‌ఐపై ఉన్న అభియోగం. పోలీసులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం, పరిధి దాటి వ్యవహరించడం, ప్రాథమిక ఆధారాలు లేకపోయినా కేసులు నమోదు చేయడం వంటివన్నీ చట్ట ఉల్లంఘనల కిందకు వస్తాయి. సాధారణంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు విచారిస్తారు. ప్రాథమిక ఆధారాలు ఉంటే ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వంటి చర్యలు తీసుకుంటారు.

రాజకీయ ఒత్తిడి ఉంటే మాత్రం విచారణతోనే సరిపెట్టేవారు. సస్పెండ్‌ అయినవారు ఏదోవిధంగా దాన్ని ఎత్తేయించుకుని పోస్టింగ్‌ తెచ్చుకునేవారు. దీంతో తప్పుచేసినా మాకేం కాదులే అనే భరోసా ఏర్పడింది. అందుకే ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడంలేదు. ఈ పరిస్థితులను కఠినమైన చర్యల ద్వారానే చక్కదిద్దాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. సస్పెండ్‌ అయిన వారిపై సమగ్ర విచారణ జరిపి, తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పైరవీలు చేసి సస్పెన్షన్‌ ఎత్తివేయించుకునే అవకాశం లేకుండా చేయాలని భావిస్తోంది. ఇకపై గీత దాటే పోలీసులపై కేసులు కూడా నమోదు చేయాలనే ఆలోచనతో ఉంది.

Police attack: జై భీమ్ సినిమా రిపీట్.. యువకుడిని చితకబాదిన పోలీసులు...

తాజా ఉదంతాలతోపాటు గతంలో జరిగిన కేసులను కూడా పునఃసమీక్షించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు గత ప్రభుత్వ హయంలో ఓ మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న నేరంపై, సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వెలువెత్తాయి. దీంతో పాటు నిజామాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యేపై కూడా ఇదే తరహాలో హత్యాయత్నం జరిగిందని హైదరాబాద్‌ పోలీసులు నమోదుచేసిన కేసు కూడా విమర్శలకు దారితీసింది.

Cases Against Police in Telangana 2023 : ఇటువంటి కేసులను పునఃసమీక్షించి, ఇందులో అత్యుత్సాహం ప్రదర్శించినట్లు, ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేసినట్లు తేలితే సదరు పోలీసులపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఇందుకు బాధ్యులైన వారిపై కొత్తగా కేసులు కూడా పెట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు

గిరిజనుడిని చితకబాదిన ఘటనలో.. ఆత్మకూరు ఎస్సై సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.