హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు రహదారి విభాగినిని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారు డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.
ఈ ఘటనతో కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును అక్కడి తొలగించి రాకపోకలకు ఎదురైన అవాంతరాలు తొలగించారు.
ఇవీ చూడండి : మఠంపల్లిలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి