హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వైపుగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టిఫిన్ సెంటర్ ముందున్న డివైడర్ను ఢీకొట్టింది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం వల్ల ప్రమాదం తప్పింది.
కారులో ఉన్నవాళ్లు... వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా... ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని... ప్రమాదానికి కారణమైన వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి