ఇటీవల గుంతకల్ డివిజన్ పర్సనల్ డిపార్ట్‌మెంట్ నుంచి సీనియర్ క్లర్క్ ఉద్యోగం కోసం జారీ చేసిన ఉత్తర్వుల లేఖతో ఒక అభ్యర్థి తమ కార్యాలయానికి వచ్చారని... రైల్వే శాఖ అధికారులు తెలిపారు. దాన్ని పరిశీలిస్తే అది నకిలీ నియామక ఉత్తర్వుగా తేలిందని పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను మరో 12 మంది అభ్యర్థులకు కూడా అందజేసినట్టు తమ దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.
రైల్వే ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులు డబ్బు గురించి మోసగించే ఇటువంటి నేరగాళ్లను ఆశ్రయించవద్దని హెచ్చరించారు. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ ద్వారా ఉద్యోగ ప్రకటనను ప్రచురిస్తామని వివరించారు. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు.
ఉద్యోగాలకు సంబంధించిన సరైన సమచారమంతా ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ, ఎస్‌సీఆర్ వైబ్‌సైట్లలో తెలియజేస్తామని అన్నారు. రైల్వేలో ఉద్యోగ భర్తీకి మరో విధానం, మధ్యవర్తుల పాత్ర ఉండదని పేర్కొన్నారు. ఉద్యోగం నేరుగా పొందడానికి ఎటువంటి దగ్గర దారులు ఉండవని అభ్యర్థులు గమనించాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఈ ఆసనంతో ఆక్సిజన్ స్థాయులు పెంచుకోవచ్చట!