ETV Bharat / state

TET Exam: టెట్​ గట్టెక్కేదెట్లా?.. బయాలజీ, భాషాపండితులకు గణిత భారం

TET Exam: బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, భాషాపండిత అభ్యర్థులు టెట్‌ను తలచుకొని ఆందోళన చెందుతున్నారు. వారు ఇంటర్‌, డిగ్రీలో చదివింది జీవశాస్త్రం. మరికొందరు తెలుగు సబ్జెక్టును పూర్తిచేశారు. వారందరికీ ఇపుడు గుండె దడ మొదలైంది. తాము ఏమాత్రం చదవని.. ఒకవేళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినా బోధించని సబ్జెక్టులపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇస్తోండటంతో ఆందోళన చెందుతున్నారు.

TET Exam: టెట్​ గట్టెక్కేదెట్లా?.. బయాలజీ, భాషాపండితులకు గణిత భారం
TET Exam: టెట్​ గట్టెక్కేదెట్లా?.. బయాలజీ, భాషాపండితులకు గణిత భారం
author img

By

Published : Mar 13, 2022, 4:41 AM IST

TET Exam: ఉపాధ్యాయ కొలువులకు రాష్ట్ర సర్కారు సమాయత్తమవుతోందన్న ఆనందం అటుంచితే బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, భాషాపండిత అభ్యర్థులు టెట్‌ను తలచుకొని ఆందోళనచెందుతున్నారు. వారు ఇంటర్‌, డిగ్రీలో చదివింది జీవశాస్త్రం. మరికొందరు తెలుగు సబ్జెక్టును పూర్తిచేశారు. వారందరికీ ఇపుడు గుండె దడ మొదలైంది. తాము ఏమాత్రం చదవని.. ఒకవేళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినా బోధించని సబ్జెక్టులపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇస్తోండటంతో కలవరపడుతున్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో టెట్‌ నిర్వహించారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్‌జీటీ)కు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 నిర్వహిస్తారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) ఆదేశాల ప్రకారం ఈసారి పేపర్‌-1కు డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ పూర్తిచేసిన వారికీ అర్హత కల్పించాల్సి ఉంటుంది. టెట్‌ను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తే ఓసీలకు 60 శాతం, బీసీలకు 50, ఎస్‌సీ, ఎస్‌టీలకు 40 శాతాన్ని అర్హత మార్కులుగా నిర్ణయించారు. టెట్‌లో కనీస మార్కులు సాధిస్తేనే డీఎస్‌సీ పరీక్ష రాయడానికి వీలవుతుంది. రాష్ట్రంలో డీఈడీ పూర్తిచేసినవారు 1.50 లక్షలు, బీఈడీ అభ్యర్థులు 3 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. వారిలో గతంలో టెట్‌ అర్హత సాధించనివారికి, 2017 తర్వాత బీఈడీ పాసైన బయాలజీ, భాషా పండిత అభ్యర్థులకు ఇపుడదే పరీక్ష తలనొప్పిగా మారింది.

110 మార్కులకు 90 తెచ్చుకుంటేనే..

డిగ్రీలో బీజడ్‌సీ(బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ) చదివిన అభ్యర్థి స్కూల్‌ అసిస్టెంట్‌ కావాలనుకుంటే పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో గణితం 30, కనీసం మరో 10 మార్కులకు భౌతికశాస్త్రానికి చెందిన ప్రశ్నలు ఇస్తున్నారు. ఆ రెండు సబ్జెక్టులూ డిగ్రీలో చదివినవి కావు. అంటే వాస్తవానికి 110 మార్కులకు ఓసీ అభ్యర్థి 90 మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా సాధ్యమన్నది బయాలజీ అభ్యర్థుల ప్రశ్న. డిగ్రీ ఎంపీసీ చదివినవారికి పేపర్‌-2లో బయాలజీ ఉన్నా అది 15 మార్కులకే పరిమితం. అందువల్ల ఎంపీసీ అభ్యర్థులకు మాదిరిగానే తమకు కూడా గణితం, భౌతికశాస్త్రం మార్కులు తగ్గించి శాస్త్రీయత ఉండేలా చర్యలు తీసుకోవాలని బయాలజీ అభ్యర్థులు కోరుతున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాషాపండితులకు సైతం సాంఘికశాస్త్రం, గణితానికి సంబంధించి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తుండటంతో వారికి టెట్‌లో అర్హత సాధించడమే గగనమవుతోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.