ఆదాయం 14; వ్యయం 2;
రాజపూజ్యం 6; అవమానం 6
ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం. అడుగడుగునా ఆటంకాలెదురవుతాయి. ధర్మబుద్ధితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. ముందస్తు ప్రణాళిక ద్వారా కష్టాలను అధిగమించవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మోసం చేసేవారున్నారు.
గతానుభవంతో పనిచేస్తే నష్టాన్ని నివారించవచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితం ఉంది. ఏకాగ్రతను పెంచితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. ఓర్పు, సహనం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒత్తిడిని అధిగమించాలి. శని, గురు శ్లోకాలు చదువుకోవాలి. శివారాధన విజయాన్నిస్తుంది.
ఇదీ చూడండి: ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?