ETV Bharat / state

'క్యాబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ'

క్రీడా విధానంపై క్యాబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేస్తూప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా జీవో 911 విడుదల చేసినట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.

Cabinet Subcommittee on Sports Policy by ts government
'క్యాబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ'
author img

By

Published : May 24, 2020, 2:09 PM IST

క్రీడా విధానంపై క్యాబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్​.. కొద్ది రోజుల క్రితం ప్రకటనకు అనుగుణంగా జీవో 911 విడుదల చేసినట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. సబ్​కమిటీకి ఆయన అధ్యక్షత వహించనుండగా.. మంత్రులు కేటీఆర్​, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు సభ్యులుగా ఉన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల క్రీడా పాలసీని పరిశీలిస్తామని.. నిపుణులు, క్రీడాకారులతో భేటీ అవుతామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.

రెండు నెలల్లో క్రీడా విధానం తయారు చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ స్టేడియం ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్​లో 7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సింథటిక్​ ట్రాక్​ను ఆదివారం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్​లో కూడా ట్రాక్​ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: వేడెక్కుతున్న సాగరాలు- భూతాపంతో విపత్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.