ETV Bharat / state

పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

author img

By

Published : Oct 2, 2021, 2:44 PM IST

Updated : Oct 2, 2021, 5:15 PM IST

పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

14:43 October 02

పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

పోడుభూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో... ఇదే అంశంపై ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం(cabinet subcommittee) భేటీ అయింది. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్​ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం(cabinet subcommittee) సమావేశమైంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి నివేదిక  ఉపసంఘం ఇవ్వనుంది.

ఆర్వోఆర్​ పట్టాలు ఇచ్చిన 3లక్షల 80 వేల ఎకరాలతో పాటు మరో ఆరేడు లక్షల ఎకరాల పోడుభూములున్నట్లు సమాచారముందని నిన్న సీఎం కేసీఆర్ తెలిపారు. వారికి సైతం ఆర్వోఆర్​ పట్టాలు, రైతుబంధు ఇచ్చేందుకు కృషి చేస్తామని.... ఇందుకోసం 2005 కటాఫ్‌ను పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అసెంబ్లీ  సమావేశాల్లోనే ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి  పంపుతామని... అవసరమైతే అఖిలపక్ష నేతలతో దిల్లీకి వెళ్లి ప్రధానిని పరిష్కరించాలని కోరనున్నట్లు చెప్పారు. ఈ తరుణంలోనే సత్యవతి నేతృత్వంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, సీఎస్​ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పోడు భూముల సమస్యలపై ఉపసంఘం చర్చించింది. సమావేశం అనంతరం మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. 

సీఎం హామీ..

అటవీ భూముల సర్వే చేపట్టడంతో పాటు త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవి బిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని.. మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలు, స్వచ్ఛమైన, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు.  

ఎన్నాళ్ల నుంచో సమస్యలు..

హరితహారం సహా ఇతర కార్యక్రమాల్లో భాగంగా పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ.. అటవీ, పోలీసు అధికారులతో ఆదివాసీలు తగాదాలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పోడు భూముల సమస్యలపై ప్రతిపక్షాలు అనేక సార్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి.  

ఇదీ చదవండి: Huzurabad by election 2021: హుజూరాబాద్​లో ఊపందుకున్న ప్రచారం.. ఇస్త్రీ చేసిన మంత్రి గంగుల

Last Updated : Oct 2, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.