ETV Bharat / state

విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచే ప్రారంభం - ఏపీలో విద్యుత్ నగదు బదిలీ పథకం

విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Electricity cash transfer scheme in AP
విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం
author img

By

Published : Sep 3, 2020, 2:13 PM IST

ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ ద్వారా అందచేయాలన్న నిర్ణయానికి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌కూడా తొలగించబోమని... ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌చేస్తామని వెల్లడించింది. కనెక్షన్‌ ఉన్న రైతు పేరుమీద ప్రత్యేక ఖాతా తెరవనున్నట్లు, మీటర్ల ఖర్చు ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం లేదని, ఉన్న పథకాన్ని మరింత మెరుగు పరుస్తున్నామన్నారు. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింతగా దీర్చిదిద్దుతామని తెలిపారు. వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌పథకానికి ఢోకాలేకుండా చేస్తున్నామని వెల్లడించారు. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు ఉండగా రబీ సీజన్‌నుంచి పూర్తిగా అమలుచేస్తామన్నారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైయస్సార్‌కేనన్నారు. వైఎస్ ఆర్ ఉచిత విద్యుత్ పథకంతోపాటు, రైతులు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేశారన్నారు. యూనిట్‌ కరెంటు 2.50 రూపాయలకే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తద్వారా ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. అంతేకాక ఉచిత విద్యుత్‌ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు.

రైతులకోసమే ఈ సోలార్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి జమ చేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారని తెలిపారు. నాణ్యమైన కరెంటు, పగటిపూట 9 గంటల కరెంటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చన్నారు. రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించమని తెలిపారు. రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారికి రెగ్యులరైజ్‌ కూడా చేస్తామన్నారు. ఒక్క కనెక్షన్‌ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని చాలా స్పష్టంగా అధికారులకు చెప్పామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా అమలు, ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుఅవుతుందని మంత్రివర్గ సమావేశంలో తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.